కోహ్లీని కంగారుపెడుతున్న సచిన్ కుమారుడు!

Friday, August 10th, 2018, 09:01:40 AM IST

సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఆల్ రౌండర్ గా ఎదగాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. అనుభవం గల ఆటగాళ్ల మధ్య ఉంటే ఆటలో పదును పెరుగుతుంది అనుకున్నాడో ఏమో గాని టీమిండియా ఆటగాళ్లతో కలిసి అర్జున్ తెగ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇండియా జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక అర్జున్ కూడా తన ప్రాక్టీస్ నిమిత్తం ఇటీవల ఇంగ్లాండ్ కు వెళ్లగా అక్కడ టీమిండియా బ్యాట్స్ మెన్ లు ఉండడం చూసి వారితో అర్జున్ ప్రాక్టీస్ చేశాడు.

విరాట్ కోహ్లీ కేఎల్. రాహుల్ లాంటి బ్యాట్స్ మెన్ లకు తన బౌలింగ్ టాలెంట్ ను చూపించి కాస్త కంగారు పెట్టించాడట. ఫాస్ట్ బౌలర్స్ ఇషాంత్ శర్మ షమీ వంటి ఆటగాళ్లు బౌలింగ్ వేస్తుంటే అర్జున్ కూడా వారిని గమనించి సలహాలు తీసుకొని కొత్త మెళకువలు నేర్చుకుంటున్నాడు. అందుకు సంబందించిన ఫొటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు విజయ సాధించిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments