కొహ్లీ, పివి సింధులకి అర్జున అవార్డ్స్

Tuesday, August 13th, 2013, 04:49:00 PM IST

players
క్రీడాకారులు తమ టాలెంట్ తో దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెస్తే వారిని కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తుంది. అలాగే కొంతమందికి అవార్డ్స్ ను కూడా అందిస్తుంది. తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మీంటన్ మహిళల సింగిల్స్ లో భారత షట్లర్ తెలుగు తేజం పి.వి. సిందు కాంస్య పతకాన్ని సాదించింది. అతి చిన్న వయసులోనే దేశానికి గుర్తింపు తెచ్చి పెట్టిన పివి సింధుకి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ఇచ్చి సత్కరించనున్నట్లు అనౌన్స్ చేసింది. అలాగే ఇంత తక్కువ వయసులో అర్జున అవార్డు దక్కించుకున్న మొట్ట మొదటి మహిళగా కూడా సింధు రికార్డ్ సృష్టించింది.

ఈమెతో పాటు భారత యువ క్రికెటర్, ఇండియా టీంలో తన బ్యాటింగ్ తో దూసుకుపోతున్న విరాట్ కొహ్లీకి కూడా అర్జున అవార్డు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే షూటర్ రంజన్ సోధికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.