జూలు విదిల్చిన ఇండియన్ ఆర్మీ..9 మంది ఉగ్రవాదులు హతం..!

Tuesday, September 20th, 2016, 06:37:03 PM IST

army
పాక్ కుట్ర తేట తెల్లమైపోయింది.యురి లో పాక్ ఉగ్రవాదులు చేసిన కుట్ర రెండు రోజులు కూడా గడవక ముందే పాక్ సైన్యం మరోమారు కాల్పులకు తెగబడింది.యురి సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. వేగంగా స్పందించిన భారత బలగం పాక్ లపులను తిప్పికొట్టింది. ఈ క్రమం లో కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ డిజి కి ఫోన్ చేసి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు.దీనితో రెచ్చిపోయిన భారత బలగాలు పాక్ కాల్పులను తిప్పికొట్టాయి. భారత్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించేందుకు వీలుగా పాక్ కాల్పులకు తెగబడింది.ఈ కుట్రను భారత బలగాలు భగ్నం చేసాయి. భారత్ లోకి ప్రవేశించాలని చూసిన 9 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.

మరో వైపు భారత్ పాక్ ని దౌత్య వేదికపై ఏకాకిని చేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారు. త్వరలో జరగబోయో ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాక్ తీరుని ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పాక్ రక్షణమంత్రి.. తమవద్ద కూడా అణుబాంబులు ఉన్నాయని అవసరమైతే వాటిని భారత్ పై ప్రయోగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇలాంటి పాక్ కాకి కూతలకు భారత్ భయపడదని బిజెపి జాతీయ ప్రధాన కార్య దర్శి రామ్ మాధవ్ అన్నారు.