సెల్యూట్ : చేతిలో చిన్నారి.. మరణించిన సైనికుడికి భార్య నివాళి

Sunday, February 25th, 2018, 01:05:44 AM IST

దేశ కోసం పోరాడే సైనికుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రాణాలను ఏ మాత్రం లెక్క చేయకుండా పోరాడడంలో వారికంటే యోధులు ఇంకెవరు ఉండరు. ఇకపోతే సైనికులు ప్రాణాలను వదిలితే ఇంట్లో వారి బాధ వర్ణనాతీతం. ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా దేశ సైనికుడు హెలీకాఫ్టర్ ప్రమాదంలో ఊహించని విధంగా ప్రాణాలను కోల్పోగా అతని భార్య దైర్యంగా నివాళులు అర్పించింది. ఆర్మీ యూనిఫాంలో మార్చ్ లో పాల్గొంది. ఆమె పేరు మేజర్‌ కుముద్‌ దోగ్రా. అయితే ఆమె చేతిలో అప్పుడు ఐదు రోజుల పాప కూడా ఉంది. ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీటిని తెప్పిస్తోంది.

అసలు వివరాల్లోకి వెళితే.. ఈ నెల 15న అసోంలో అనుకోని విధంగా మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్రాష్ అయిన విషయం తెలిసిందే. ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంలో అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. మరణించిన వింగ్‌ కమాండర్‌ డి.వాట్స్‌కు గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే భార్య మేజర్‌ కుముద్‌ దోగ్రా వృత్తిలో భాగంగా మార్చ్ లో పాల్గొని భర్తకు నివాళులు అర్పించింది. ఆమెకు అయిదు రోజుల క్రితం పాప జన్మించింది. పాపను చేతిలో ఉంచుకొని ఆమె అంత్యక్రియల్లో లో పాల్గొన్న తీరు అందరిని కలచివేసింది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి.