షాకింగ్ ఫోటో: చేతిలో తుపాకీ..దానిపై పాము

Friday, April 27th, 2018, 11:26:18 PM IST


ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు ఎదురుగా పాము కనిపిస్తే ఒక్కసారిగా మనిషి షాక్ అవ్వడం కాయం. అలాగే ఎంతటి ధైర్యవంతుడు అయినా కూడా భయపడకుండా ఉండలేడు. అయితే ఒక సైనికుడు మాత్రం తన ముందు పొడవైన నల్లని పాము ఉన్నప్పటికీ కొంచెం కూడా బెదరలేదు. అందుకు సంబందించిన ఓకే ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన టార్గెట్ ముందు ఆ పాము చాలా చిన్నదాని చెప్పకనే చెప్పాడు.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. అమెరికాలో ఒక జూనియర్ ఆర్మీ జవాన్ గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ లో బిజీగా ఉండగా ఒక పాము అతని దగ్గరకు వచ్చింది. 1-173 ట్రైనింగ్ సమయంలో పాము అతని ముందే దోబూచులాడుతూ గన్ మీద నుంచి వెళ్లిపోయింది. దాన్ని చూసి సైనికుడు ఏ మాత్రం బెదరలేదు. అలాగే ఆర్మీ సిబ్బంది అప్పుడే దైర్యంగా ఆ ఘటనని తన కెమెరాలో బంధించాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. పాముని చూసి కొంచెం కూడా భయపడని సోల్జర్ కి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని అంతా కామెంట్స్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments