గేమ్ స్టార్ట్స్ నౌ..అర్నబ్ గోస్వామి వీడియో లీక్..!

Friday, November 4th, 2016, 02:23:02 PM IST

arnab-goswami
ప్రముఖ జర్నలిస్ట్ టైమ్స్ నౌ ఎడిటర్ అయిన అర్నబ్ గోస్వామి ఆ సంస్థకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన వీడ్కోలు ప్రసంగం నెట్ లో హల్ చల్ చేస్తోంది. గేమ్ ఇప్పుడే మొదలైంది అని భావోద్వేగంగా ప్రసంగిస్తున్న అర్నబ్ వీడియో నెట్ లో ప్రత్యక్షమైంది. మీడియా స్వేచ్ఛ పై నమ్మకం కోల్పోవద్దని అర్నబ్ తన సహచరులకు సూచించాడు.

ఇండిపెండెంట్ మీడియాగురించి మనకు ఎవరూ భోదించరని, అది మనమే తెలుసుకోవాలని ఆయన అన్నారు.తనకు సహకరించిన సహచరులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా అర్నబ్ తన తదుపరి అడుగు ఎటువైపు వేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొని ఉంది. ఆయన త్వరలో తన మకాం బెంగుళూరు కు మార్చబోతున్నారని ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ ఎంపీ అయిన రాజీవ్ చంద్రశేఖర్ తో కలసి అర్నబ్ కొత్త ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ ని ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం రాజీవ్ చంద్రశేఖర్ బిజెపి కేంద్ర అధిష్టానంతో సన్నిహితంగా మెలుగుతున్నారు.అర్నబ్ కొత్త ఛానెల్ వెనుక బిజెపి హస్తం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.