స్ట‌న్నింగ్‌: యారీ కెమెరా- 2018 షో రీల్‌!!

Friday, April 6th, 2018, 08:00:47 PM IST


డిజిట‌ల్ టెక్నాల‌జీతో ప‌రిశ్ర‌మ‌ స‌మూలంగా మారిపోయింది. సినిమా తీరుతెన్నులు, పోక‌డ‌ల్ని సాంకేతిక‌త పూర్తిగా శాసిస్తోంది. ఇప్పుడు ప్ర‌తిదీ సులువైపోయింది. ఖ‌రీదైన‌వి కూడా అందుబాటు ధ‌ర‌ల్లో ల‌భిస్తున్నాయి. దీంతో ఫిలింమేకింగ్ లో అసాధార‌ణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు న‌వ‌త‌రం ప్ర‌తిభావంతుల రాక పెరుగుతోంది. అయితే సినీరంగంలోకి యారీ కెమెరా రాక ఓ పెను విప్ల‌వం అనే చెప్పాలి. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే ఇబ్బ‌డిముబ్బ‌డిగా అధునాత‌న కెమెరాలు సినీరంగంలో అందుబాటులోకి వ‌చ్చాయి. ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా కెమెరాల్ని ఛాయాగ్రాహ‌కులు సొంతంగా స‌మ‌కూర్చుకుని ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తున్నారు.

ఇక యారీ సిరీస్ కెమెరాల్ని ఈ ఏడాదిలో రిలీజైన ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ఉప‌యోగించారు. రీసెంటుగా రిలీజైన బ్లాక్ పాంథ‌ర్‌, ఇటీవ‌లే ఆస్కార్ లు అందుకున్న `షేఫ్ ఆఫ్ వాట‌ర్‌`, ప‌ద్మావ‌త్ 3డి, డెడ్‌పూల్‌, అవెంజ‌ర్స్ 2 వంటి భారీ చిత్రాల‌కు యారీ కెమెరాల్ని ఉప‌యోగించారు. ఇవేనా సౌతిండియాలో చాలా సినిమాల‌కు యారీ కెమెరానే. అప్ప‌ట్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ సాధించిన మెర్స‌ల్ చిత్రాన్ని యారీతోనే తెర‌కెక్కించారు. హిట్టు సినిమా, ఫట్టు సినిమా .. అస‌లు సినిమా ఏదైనా దానికి యారీ కెమెరా ఉండాల్సిందే. అయితే లేటెస్టుగా యారీ టెక్ టీమ్ ఈ సిరీస్ కెమెరాల‌తో తెర‌కెక్కించిన భారతీయ సినిమాలు, హాలీవుడ్ సినిమాల విజువ‌ల్స్‌తో అద్భుత‌మైన 8 నిమిషాల నిడివి షో రీల్‌ని తయారు చేసి రిలీజ్ చేసింది. ల‌క్ష‌ల కోట్ల విలువ చేసే వ్యాపార సామ్రాజ్యాన్ని యారీ కెమెరా ఎలా శాసిస్తుందో అర్థం చేసుకోవ‌డానికి ఈ విజువ‌ల్స్ చూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments