అయ్యో ప‌వ‌న్‌కి 11వేల మంది ఫ్యాన్సేనా?

Tuesday, May 8th, 2018, 03:40:17 AM IST

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆర్జీవీ అలియాస్ రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌ధ్య వార్‌ గురించి తెలిసిందే. డ‌ర్టీపిక్చ‌ర్‌కి డూప్ సినిమాలా మ‌హా గొప్ప‌గానే అల‌రించింది ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌. అదంతా అటుంచితే, ప‌వ‌న్‌కి వ్య‌తిరేకంగా వెళ్లిన పాపం రామూని ఇప్ప‌ట్లో వ‌దిలిపెట్టేట్టు లేదు. వ‌ద‌ల బొమ్మాళీ వ‌ద‌ల అని వెంబ‌డిస్తోంది. అస‌లు రామ్‌గోపాల్ వ‌ర్మ ఏ యాక్టివిటీ చేసినా, అత‌డిని ప‌వ‌న్ అభిమానులు వ‌దిలిపెట్ట‌డం లేదు. ఆన్‌లైన్‌, సామాజిక మాధ్య‌మాల్లో ఊచ‌కోత కోస్తున్నారు.

తాజాగా రిలీజైన ఆఫీస‌ర్ ట్రైల‌ర్‌కి ఓ ర‌క‌మైన కోటింగ్ ఇచ్చారు. యూట్యూబ్‌లో ఆఫీస‌ర్ ట్రైల‌ర్‌కి ఏకంగా 11 వేల డిస్‌లైక్స్ రావ‌డంతో ఆర్జీవీ ఖంగు తిన్నాడు. అయితే వెంట‌నే గొంతు స‌వ‌రించుకుని.. “అయ్యో! ప‌వ‌న్‌కి 11 వేల మంది ఫ్యాన్సేనా? ఒక అభిమానిగా నేను పెద్ద షాక‌య్యాను. చాలా విచారంగా ఉంది..“ అని రీట్వీట్ చేశాడు. మొత్తానికి ఆర్జీవీకి, అత‌డి వ‌ల్ల నాగార్జున‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ అలా ఝ‌ల‌క్ తినిపిస్తున్నార‌న్న‌మాట‌!