ఓటు హక్కు వినియోగించుకున్న అసదుద్దీన్ ఒవైసీ.. కీల‌క వ్యాఖ్య‌లు..!

Friday, December 7th, 2018, 11:20:38 AM IST

తెలంగాణ ఎన్నికల నేప‌ధ్యంలో పోలింగ్ న‌మోదు ప్రారంభం అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఉన్న శాస్త్రిపురంలో 317 నెంబర్ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వెళ్లిన అసదుద్దీన్ ఒవైసీ, తన ఓటర్ కార్డు చూపించారు.

ఇక ఈ క్ర‌మంలో ఓటు హక్కును వినియోగించుకున్నఅసదుద్దీన్ ఒవైసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అంద‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని పిలుపునిస్తూ.. విజ‌యం మాదే అనే ధీమా వ్య‌క్తం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎంఐఎంతోపాటు టీఆర్ఎస్, టీడీపీ కూడా బరిలో ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది.