కాశ్మీర్ ఆపిల్స్ నీ బుగ్గలు..నర్సుపై బాబా ‘ఆశ’రామ్..!

Monday, September 26th, 2016, 09:30:20 AM IST

swamiji
అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన ఆధ్యాత్మిక గురువు బాబా ఆశారామ్ మరో వివాదం లో ఇరుక్కున్నాడు.ఆయన ప్రతుతం తీహార్ జైలు లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. బెయిలు కోసం ఆశారామ్ సుప్రీం కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. అది విచారణకు రానుంది.ఈ నేపథ్యం లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన నివేదిక అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

దీనితో ఆయనను ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి లో నర్సు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఆసుపత్రిలోని ఓ నర్సుని “నీబుగ్గలు కాశ్మిర్ ఆపిల్స్ లా ఉన్నాయ్”అని వ్యాఖ్యానించారు.అంతేకాక తాను యువకుడిగా మారే చికిత్స చేయాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.ఆశారామ్ జైలుకి వెళ్లినా బుద్ధి రాలేదంటూ కొందరు మండిపడుతున్నారు.