బాలిక ను బెదిరించి అత్యాచారం చేసిన ఆశారాంకు జీవిత ఖైదు!

Friday, April 27th, 2018, 12:35:41 AM IST

ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు బాబాల పేరుతో నమ్మబలికి అభంశుభం తెలియని ఆడవారిని, బాలికలను లొంగదీసుకుంటున్న సంఘటనలు అక్కడక్కడా విన్నాము. అటువంటి కోవకు చెందినవాడే జోధాపూర్ కు చెందిన ఆశారాం బాపు. 2013 వ సంవత్సరం ఆగష్టు 15వ తేదిరాత్రి ఒక బాలికపై అమానుషంగా అత్యాచారం చేసిన ఆయనకు ఎట్టకేలకు జోధాపూర్ కోర్ట్ జీవిత ఖైదు విధించింది. అత్యాచారం గావింపబడ్డ బాలిక తల్లితండ్రులు ఆశారాం ను ఎంతో విశ్వసించేవారు.

విషయంలోకి వెళితే, ఉత్తరప్రదేశ్, షాజహాన్ పూర్ కు చెందిన ఆ బాలిక మద్యప్రదేశ్ లోని ఛింద్వాడా ఆశ్రమంలో వుండి చదువుకునేది. గతకొద్దిరోజులుగా బాలికపై కన్నేసిన ఆశారాం తన అనుచరురాలు సహాయంతో బాలికకు దయ్యం పట్టిందని వారి కుటుంబీకులను నమ్మించి ఆగష్టు 15వ తేది రాత్రి తన వద్దకు పంపితే వదిలిస్తానని చెప్పి పిలిపించి అత్యాచారం చేసాడు. ఈ విషయమై బాలిక తల్లితండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఆసమయంలో ఆశారాం తనను వివిధ రకాలుగా భయపెట్టాడని బాలిక అంటోంది. నువ్వు ఏమి చదదువుకుంటావు అని అడిగితే, నేను ఛార్టర్డ్ అకౌంటెంట్ చదవాలని వుంది అని చెప్పాను.

దానికి ఆయన బదులిస్తూ ఎంతో మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు నా కాళ్లకు రోజూ మ్రొక్కుతారు. నువ్వు బీఈడీ చేయి మొదట నిన్ను టీచర్ ని, ఆతరువాత ఒక స్కూల్ కి ప్రిన్సిపాల్ ని చేస్తాను అని బెదిరించినట్లు ఫిర్యాదులో బాలిక తెలిపింది. అయితే బాలిక ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 1న ఆశారాంను, అతని ముగ్గురు అనుచరులతోసహా పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండులో ఉంచారు. మొదట సెషన్స్ కోర్ట్ విచారణ అనంతరం, కేసును ఎస్సి, ఎస్టీ జోధపూర్ కోర్ట్ కి బదిలీ చేశారు. ఈ కేసులో ముగ్గురు సాక్షులుగా వున్న వ్యక్తులు హత్యకు గురికాగా, మరికొందరిపై తీవ్ర దాడులు జరిగాయి. అయితే తుది వాదనలు విని ఆయన నేరం చేసాడని నిర్ధారించిన జోధపూర్ కోర్ట్ ఆయనకు జీవిత ఖైదుతోపాటు, ఆయనకు సహకరించిన ముగ్గురు శిష్యులకు ఒక్కొక్కరికి 20 ఏళ్లపాటు శిక్షను విధించింది……

  •  
  •  
  •  
  •  

Comments