ఏపీకి హోదాపై అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు!

Tuesday, April 24th, 2018, 04:28:44 PM IST


ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఎప్పుడు ఏదో ఒకవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. నేడు కడప జిల్లాలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఉద్యమం పై సంచలన వ్యాఖ్యలు గుప్పించారు. హోదా ఉద్యమం ప్రస్తుతం పూర్తిగా ఒక రాజకీయంగా మారిపోయిందని అన్నారు. అసలు విభజన సమయంలో ఏపీకి పది సంవత్సరాలపాటు హోదా ఇస్తామని ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. అయినా ఓవైపు హోదా ఇవ్వలేమని ఎన్డీయే ప్రభుత్వం చెపుతుంటే మనం మన చందాన ఉద్యమాలు, నిరసనలు చేయడం, బిజెపి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడం సరైనది కాదని,

దానివల్ల మనకే నష్టమని ఆయన అన్నారు. ఈ ఉద్యమాల వల్ల ప్రధమంగా నష్టపోయేది ప్రజలే, అంతే కాదు ఉయామాల్లో ఉద్యోగులు పాల్గొంటే దానివల్ల వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన అన్నారు. అసలు నిజానికి ఒకప్పుడు వుమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని లేఖలు ఇచ్చిన వారే ప్రస్తుతం ఏపీకి మళ్ళి హోదా కావాలని ఉద్యమాలు చేయడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పధంలో నడుస్తూ గాడిలో పడుతున్న ఈ సమయంలో ఈ ఉద్యమాల వల్ల జరిగే ఆ కాస్త అభివృద్ధి జరగక కుంటుపడుతునని అన్నారు……..

  •  
  •  
  •  
  •  

Comments