టీమిండియాను రోహిత్ చేతిలో పెట్టేశారు!

Saturday, September 1st, 2018, 04:30:44 PM IST

ఇంగ్లాండ్ పర్యటనలో ప్రస్తుతం బిజీగా ఉన్న టీమిండియా జట్టు మరో రెండు వారాల్లో యూఏఈలో జరగనున్న ఆసియా కప్ కోసం సిద్ధం కానుంది. అందుకు ఆ భారత జట్టును సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. అయితే ఈ సారి జట్టులో ఊహించని మార్పులు చేశారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ రెస్ట్ ఇవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది. వరుసగా సిరీస్ లలో పాల్గొంటూ బ్యాటింగ్ భారం ఒక్కడే మోస్తున్న కోహ్లీకి విశ్రాంతి ఇస్తూ సెలక్షన్ కమిటీ అతని స్థానంలో అంబటి రాయుడికి అవకాశం ఇచ్చింది. దీంతో కెప్టెన్ గా రోహిత్ బాధ్యతలు తీసుకోనున్నాడు.

ఇక వైస్ కెప్టెన్ బాధ్యతలను శిఖర్ ధావన్ కి అప్పగించారు. ధోనికి బ్యాకప్ గా ఈ సారి రిషబ్ పంత్ కి అవకాశం అందుతుందని అంతా అనుకున్నప్పటికీ మళ్ళీ దినేష్ కార్తీక్ ని అదృష్టం వరించింది. గాయాలతో సతమతమైన కేదార్ జాదవ్ , భువనేశ్వర్ తీరిగి జట్టులోకి రానున్నారు. బౌలింగ్ లో పెద్దగా మార్పులు చేయని కమిటీ ఒక కొత్త ఆటగాడిగి జట్టులో స్థానం కల్పించింది. గత కొంత కాలంగా రంజీ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణిస్తున్న యువ ఆటగాడు, లెఫ్టార్మ్‌ మీడియం పేస్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌కు మంచి అవకాశం దక్కింది. ఈ నెల 15 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది.

టీమిండియా జట్టు:

రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, అంబటి రాయుడు, మనీష్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోని, దినేశ్‌ కార్తీక్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌, అక్షర్‌ పటేల్‌, శార్దుల్‌ ఠాకూర్‌, ఖలీల్‌ అహ్మద్‌, జస్ప్రిత్‌ బుమ్రా

 

నేటిఏపి స్పెషల్ : టీవీల్లో అత్యధిక TRP రేటింగ్స్ అందుకున్న సినిమాలు

  •  
  •  
  •  
  •  

Comments