ఆసియా కప్ : అందరి చూపు ఆ మ్యాచ్ పైనే!

Saturday, September 15th, 2018, 11:31:56 AM IST

ఇంగ్లాండ్ టూర్ లో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా ఆసియా కప్ గెలిచి అభిమానులను ఖుషి చేయాలనీ చూస్తోంది. నేటి నుంచి 28వ తేదీ వరకు క్రికెట్ అభిమానులకు సరికొత్త కిక్ దొరకనుంది. ముఖ్యంగా ఈ టోర్నీలో ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. దుబాయ్ లో జరుగనున్న ఈ టోర్నీలో 19వ తేదీన ఇండియా జట్టు పాకిస్తాన్ తో తలపడనుంది. అందరి చూపు ఎక్కువగా ఈ మ్యాచ్ పైనే ఉంది. ఇక ఈ మ్యాచ్ లకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు.

అతనికి విశ్రాంతి ఇచ్చి రోహిత్ కు పగ్గాలు అప్పగించారు. చాలా కాలం తరువాత ధోని కూడా జట్టుతో కలవనున్నాడు. ఇప్పటి వరకు ఆసియా కప్ పోటీలు 12 సార్లు జరుగగా టీమిండియా ఆరుసార్లు గెలిచింది. ఇక ఈ సారి టోర్నమెంట్ లో కొన్ని మార్పులు జరిపారు. మొత్తంగా టోర్నీలో పాల్గొనే ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గతంలో ఒకగ్రూప్ లో ఉన్న జట్లన్నీ అన్ని టీమ్ లతో ఆడేవి. ఇక టాప్ 2 టీమ్ లకు ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించేవారు. ఈసారి మాత్రం విభజించిన గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ ఫోర్ కు వెళతాయి. ఇక వన్డే ఫార్మాట్ లో ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి.

ఆసియా కప్ షెడ్యూల్:

గ్రూప్ స్టేజ్:

సెప్టెంబర్‌ 15 శనివారం – గ్రూప్ బి – శ్రీలంక × బంగ్లాదేశ్‌
సెప్టెంబర్‌ 16 ఆదివారం – గ్రూప్ ఎ – హాంకాంగ్‌ × పాకిస్థాన్‌
సెప్టెంబర్‌ 17 సోమవారం – గ్రూప్ బి – శ్రీలంక × అఫ్గానిస్తాన్‌
సెప్టెంబర్‌ 18 మంగళవారం – గ్రూప్ ఎ – భారత్‌ × హాంకాంగ్‌
సెప్టెంబర్‌ 19 బుధవారం – గ్రూప్ ఎ – భారత్‌ × పాకిస్థాన్‌
సెప్టెంబర్‌ 20 గురువారం – గ్రూప్ బి – బంగ్లాదేశ్‌ × అఫ్గానిస్థాన్‌

సూపర్ ఫర్:

సెప్టెంబర్‌ 21 – సూపర్ 4 మ్యాచ్‌ 1, 2
సెప్టెంబర్‌ 23 – సూపర్ 4 మ్యాచ్‌ 3, 4
సెప్టెంబర్‌ 25 – సూపర్ 4 4 మ్యాచ్‌ 5
సెప్టెంబర్‌ 26 – సూపర్ 4 4 మ్యాచ్‌ 6

సెప్టెంబర్‌ 28 – ఫైనల్‌

  •  
  •  
  •  
  •  

Comments