క్షమాపణ కోరిన పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ ఆసిఫ్

Tuesday, August 20th, 2013, 06:11:02 PM IST

Asif-submits-written-ap

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్ తన తప్పును ఒప్పుకొని క్రికెట్ బోర్డు(పీసీబీ)ని క్షమించమంటూ లేఖని రాశారు. తనని మళ్ళి క్రికెట్ లోకి త్వరగా తీసుకోవడానికి కృషి చెయ్యవలసిందిగా కోరాడు. ఈ లేఖలో తను స్పాట్ ఫిక్సింగ్ విషయంలో అధికారులకు సహకరిస్తానని తెలియజేశాడు. 30 సంవత్సరాలు వున్న ఆసిఫ్ కి రెండు సంవత్సరాల క్రితం జరిగిన స్పాట్ ఫిక్సింగ్ లో బాగంగా ఏడూ సంవత్సరాల పాటు నిషేధం విదించారు. ఈ విషయాపై పీసీబీ అధికారులు, అవినీతి నిరోధక శాఖ నిన్న లాహోర్ లో కలిశాడు. అయితే 2010లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ నేరంలో బాగంగా ఆసిఫ్ తో పాటు మాజీ స్కిపర్ సల్మాన్ బట్, మహమ్మద్ ఆమీర్ లపై కూడా ఐసీసీ 2011లోనే నిషేధం విదించింది.