తెలంగాణా లో రద్దయిన అసెంబ్లీ సమావేశం..!

Thursday, September 6th, 2018, 02:25:20 PM IST

తెలంగాణలో రాష్ట్రం లో అసెంబ్లీ సమావేశాలు రద్దు చేస్తున్నట్లు తాజా గా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రద్దు అనేది ముందు అధికారంకంగా వెల్లడించకపోయినా అంతకు ముందు వారి క్యాబినెట్ సమావేశం ఉంటుందని ఆ తర్వాత అసెంబ్లీ సమావేశం రద్దు కోసం అధికారంకంగా వెల్లడిస్తారని క్యాబినెట్ సమావేశానికి సమయం దగ్గర పడుతున్నందున మంత్రులు మరియు ఉన్నతాధికారులు అందరు ప్రగతి భవన్ కు రావాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. ఇక వివల్లోకి వెళ్లినట్టయితే..

తెలంగాణలో ముందు 12 గంటల లోపు వారి పార్టీ కి సంబందించిన నేతలు, మంత్రులు ప్రగతి భవన్ కు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు అని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సమావేశం రెండు దశలుగా ఉంటుందని, మొదటి దశ సమావేశంలో ఉద్యోగులకి మధ్యంతర భృతితో పాటు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని, ఆ తరవాత ఈ రెండు దశలను కలిపి ఏక వాక్య తీర్మానంగా మలచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వారి వినతిని వారి మంత్రుల తో కలిసి గవర్నర్ నరసింహన్ గారితో ఒక 15 నిమిషాలు చర్చించి, తర్వాత అధికారకంగా అసెంబ్లీ రద్దు ఏ కారణాల వలన చేస్తున్నామో ఎందుకోసమని ముందస్తు ఎన్నికలు కోరబోతున్నారో అధికారకంగా వెల్లడిస్తారని తెలుస్తున్నది.

  •  
  •  
  •  
  •  

Comments