లెగ్ స్పిన్నర్ గా అశ్విన్ ?

Wednesday, February 7th, 2018, 01:00:55 PM IST

భారత స్పిన్నర్ల విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ ది ప్రత్యేక శైలిగా చెప్పుకోవచ్చు. తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్ మాన్ ను ముప్పు తిప్పలు పెట్టె అశ్విన్ స్పిన్ ను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అయితే అశ్విన్ ప్రస్తుతం టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ సెలక్షన్‌ కమిటీ అశ్విన్ కు వన్డే క్రికెట్‌ జట్టులో స్థానం కల్పించలేదు. అయితే స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్ యాదవ్ లకు మాత్రం అవకాశమిచ్చింది. తమ అద్భుత ప్రదర్శనతో వారిద్దరూ క్రమంగా జట్టులో చోటు సంపాదించగా, అశ్విన్‌ మాత్రం వన్డేలకు దూరమయ్యాడు. ఐతే అశ్విన్‌ మాత్రం తన ఆశలను ఇంకా వదులు కోలేదు. తిరిగి పరిమిత ఓవర్ల మ్యాచ్ తో జట్టులోకి రావాలనే పట్టుదలతో ఉన్నాడు.

అందుకోసం పరిస్థితులకు తగినట్లుగా తన బౌలింగ్ లో మార్పులు చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం అందులో భాగంగా లెగ్‌స్పిన్‌నూ సాధన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో నా ప్రణాళికల్లో లెగ్‌స్పిన్‌ కూడా ఉంది. దాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా మెళకువలు నేర్చుకుంటున్నట్లు సమాచారం. చెన్నైలో లీగ్‌ మ్యాచ్ లు ఆడేటప్పుడు నా ఆఫ్‌స్పిన్‌ శైలితో మంచి లెగ్‌బ్రేక్స్‌ వేసేవాణ్ని అనీ, కాని కాలక్రమంలో నా అసలైన అస్త్రం ఆఫ్ స్పిన్ కి పదును పెంచుకోవడం కోసం అలాంటి వాటిని తగ్గించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో లెగ్ స్పిన్ దిశగా మార్పులు చేసుకోవడం ఒక రకంగా పెద్ద సవాలే అని అశ్విన్‌ అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments