ఆసుపత్రిలో మాజీ ప్రధాని వాజ్‌పేయి.. క్యూ కడుతున్న నేతలు!

Tuesday, June 12th, 2018, 03:31:22 AM IST

భారత జనతా పార్టీ సీనియర్ రాజకీయ నాయకులూ భారత మాజీ ప్రధానమంత్రి ఇటీవల కొంత అస్వస్థతకు గురవ్వడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చేరారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా సమక్షంలో చిక్కిత్స పొందుతున్న వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ప్రకటన కూడా విడుదల చేశారుఅయితే వాజ్‌పేయిని పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర సోమవారం సాయత్రం హాస్పిటల్ కి వెళ్లారు. వాజ్‌పేయితో నరేంద్ర మోడీకి ఎనలేని అనుబంధం ఉంది. కీలకనేతగా మోడీ ఈ స్థాయిలో ఉండడానికి అప్పట్లో ఆయన నుంచి మంచి మద్దతు లభించింది.

ఇకపోతే హాస్పిటల్ లో వాజ్ పేయి ని చూసి మోడీ వైద్యులతో మాట్లాడారు. ఇక మోడీ కంటే ముందే భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు వాజ్ పేయి ని చూడటానికి వచ్చారు. మెయిన్ గా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కూడా వైద్యులతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా ఎయిమ్స్‌ వద్దకు ముందుగానే వచ్చారు. అందరు వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి తెలుసుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments