కస్టమర్లకు షాకిచ్చిన ఏటీఎం !

Monday, April 23rd, 2018, 06:08:07 PM IST

ప్రస్తుతం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఏటీఎం కష్టాలు వున్నాయి. కాకపోతే మన రాష్ట్రాల్లో మరి కొంత ఎక్కువగా ఉన్నాయని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు. విషయం లోకి వెళితే దొరక్క దొరక్క ఒక ఏటీఎం లో డబ్బులు దొరికాయని సంతోష పడ్డ ఆ కస్టమర్లకు పెద్ద షాక్ తగిలింది. ఉత్తర్ ప్రదేశ్లోని బరేలి జిల్లా, సుభాష్ నగర్లో యునైటెడ్ బ్యాంకు అఫ్ ఇండియా ఏటీఎంలో డబ్బులు వస్తున్నాయని తెలిసి ఒకవ్యక్తి తన కార్డు తో కొంత మొత్తం డబ్బు డ్రా చేసాడు. అయితే వచ్చిన ఆ నోట్లను చూసిన అతడు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. తీరా చూస్తే అవి నకిలీ రూ.500 నోట్లు. వాటిమీద రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా అని ఉండాల్సింది,

చిల్డ్రన్స్ బ్యాంకు ఆఫ్ ఇండియా, భారతీయ మనోరంజన్ బ్యాంకు, చేరాం లేబిల్ అని రాసి ఉండడంతో అతడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే ఇతనికంటే ముందు కొంతమంది కూడా ఇక్కడ డబ్బులు తీసుకున్నారు. వారికి కూడా ఇలాంటి నోట్లే రావడంతో వారు బ్యాంకు లో కంప్లైంట్ చేసారు. కాగా ఆ నోట్లను వీడియోతీసి ఆ కస్టమర్లు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది…..