కేసీఆర్ పై అట్రాసిటీ కేసు

Monday, June 10th, 2013, 02:14:52 PM IST

టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను అసభ్య పదజాలంతో దూషించారని టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు చింతా స్వామి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వట్లేదని కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న స్వామి.. ఆదివారం తెలంగాణ భవన్ ఎదుట చావు డప్పు కొట్టి, తన నిరసన వ్యక్తం చేశారు.

ఆ సమయంలో తనపై దాడి చేశారంటూ చింతస్వామి ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించి కొట్టారని చింత స్వామి తన ఫిర్యాదులో తెలిపారు. దాంతో పోలీసులు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, జగదీష్, సుభాష్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, గొట్టిముక్కుల పద్మారావుపై అట్రాసిటీ నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.