జగన్ పై హత్య కేసులో కొత్త మలుపు ఈ సారి లై డిటెక్టర్ తో..!?

Friday, November 2nd, 2018, 02:57:46 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ పై శ్రీనివాసరావు అనే వ్యక్తి చేసినటువంటి హత్యా యత్నం పై విచారణ ఇంకా ఒక కొలిక్కి రాలేదు.జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు పై సిట్ పోలీసులు చేస్తున్నటువంటి విచారణ ఈ రోజు ముగియనుంది.ఇప్పటికే ఐదు రోజులు విచారణ చేసినటువంటి పోలీసులు ఇప్పటివరకు అతని నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు అని తెలుస్తుంది,అసలు అతను ఎందుకు దాడి చెయ్యాలనుకున్నాడు ఎవరు చెప్తే ఈ ఉదంతానికి పాల్పడ్డాడు ఇలాంటి ముఖ్య ప్రశ్నలన్నిటికీ అతను ఏవేవో వింత వింత సమాధానాలు ఇస్తున్నాడని విచారణలో పోలీసులు తెలుపుతున్నారు.

ఇప్పటికే అతని యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వైద్యుల చేత మంచి వైద్యం చేయించగా ఇప్పుడు అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వారు తెలిపారు.కానీ శ్రీనివాసరావు మాత్రం ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం ఇవ్వకుండా పోలీసులను ఇబ్బంది పెడుతున్నాడని,అతని మీద విచారణకు ఇంకాస్త గడువు వారికి కావాలని సిట్ బృందం పిటీషను దాఖలు చేసినట్టు తెలుస్తుంది.అతన్ని రిమాండు లోకి తీసుకొని ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితిలోను నిజం రాబట్టే యోచనలో ఉన్నట్టు వారు తెలుపుతున్నారు. అంతే కాకుండా ఈ సారి విచారణలో అతని నుంచి అసలైన నిజాలు రాబట్టడానికి లై డిటెక్టర్ ని కూడా ఉపయోగించే ఆలోచనలో ఉన్నామని సిట్ బృందం తెలుపుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments