జ‌గ‌న్ పై దాడి ఇష్యూ.. ఆదివారం మీడియా ముందుకు విజ‌య‌మ్మ‌.. ఇంత‌కీ ఏం మాట్లాడ‌తారు..?

Saturday, November 10th, 2018, 05:52:25 PM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నంలో భాగంగా క‌త్తితో దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇక జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి పై టీడీపీ నేత‌లు ఓవ‌ర్‌గా స్పందించ‌గా.. వైసీపీ శ్రేణులు కూడా బాగానే కౌంట‌ర్ ఇచ్చారు. అయితే జ‌గ‌న్ కానీ ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ కానీ ఇప్ప‌టి వ‌ర‌కు మీడియా మందుకు వ‌చ్చి ఆ ఘ‌ట‌న పై స్పందించ‌లేదు. అయితే తాజా మ్యాట‌ర్ ఏంటంటే జ‌గ‌న్ ఫ్యామిలీ స్పందిచ‌నున్నార‌ని స‌మాచారం.

జ‌గ‌న్ త‌ల్లి, వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు మీడియా ముందుకు వ‌చ్చి జ‌గ‌న్ పై జ‌రిగిన దాడిపై మాట్లాడ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక విజ‌య‌మ్మ‌తో పాటు జ‌గన్ కుటుంబ స‌భ్యులు కూడా మీడియా ముందుకు వ‌స్తార‌ని స‌మాచారం. దీంతో ఆదివారం విజ‌య‌మ్మ ఏం మాట్లాడ‌తారో అని స‌ర్వ‌త్రా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. జ‌గ‌న్ పై దాడి జరిగిన త‌ర్వాత ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎవ‌రూ స్పందించ‌లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళంగా ఉంది. ఈ నేప‌ధ్యంలో తాజాగా జ‌గ‌న్ కుంటుంబం మీడియా ముందుకు రావ‌డంతో విజ‌య‌మ్మతో పాటు కుటుంబ స‌భ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments