జ‌గ‌న్ పై దాడి ఘ‌ట‌న‌.. ఆవు చేలో మేస్తే.. దూడ గ‌ట్టున మేస్తుందా..?

Thursday, November 1st, 2018, 12:00:18 PM IST

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జగన్ మోహన రెడ్డి పై హత్యాయత్నంలో భాగంగా జ‌రిగిన దాడి ఘ‌ట‌న పై మాన‌వ‌త్వం ఉన్న‌వారు ఎవ‌రైనా ముందు ఖండిస్తాడు.. అయితే టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హ కొంద‌రు టీడీపీ నేత‌లు, చాలా ధారుణంగా జ‌గ‌న్ పై, వైసీపీ శ్రేణుల పై, ముఖ్యంగా జ‌గ‌న్ కుటుంబం పై ఘోర‌మై వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ నేత‌ల పై ఏపీ ప్ర‌జ‌ల నుండే కాకుండా స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెలువెత్తుతున్నాయి.

ఇక జ‌గ‌న్ దాడి పై టీడీపీ నేత‌ల చేసిన ఆరోప‌ణ‌ల విష‌యానికి వ‌స్తే.. దాడి జ‌రిగిన వెంట‌నే డీజీపీ దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ జ‌గ‌న్ అభిమాని అని తేల్చేశారు. ఇక చంద్ర‌బాబు అయితే జ‌గ‌న్ సానుభూతి కోసం నాట‌కాలు ఆడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి లోకేష్ అదొక జ‌గ‌న్నాట‌క‌మ‌ని కోడిక‌త్తి డ్రామా అని ట్వీట్స్ చేశారు. ఇక టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే.. జ‌గ‌న్ కావాల‌నే పొడిపించుకున్నాడ‌ని, క‌త్తి అరంగుళం దిగిందా, అంగుళం దిగిందా అని దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేశారు.

ఇక మ‌రో టీడీపీ నేత ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ అయితే మ‌రీ ఘోరంగా జ‌గ‌న్ పై దాడి విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌లు చేయించార‌ని వ్యాఖ్య‌లే చేశాడు. ఆ వ్యాఖ్య‌ల పై అన్ని వైపుల నుండి వ్య‌తిరేక‌త ఎదుర‌వ‌డంతో.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగారు. ఈ నేప‌ధ్యంలో త‌న అనుకూల పత్రిక‌ల‌కు లీకులు ఇచ్చుకుంటున్నాడు చంద్ర‌బాబు. అయితే ఇలాంటి దిగ‌జారుడు వ్యాఖ్య‌లు టీడీపీ శ్రేణుల నుండి ఊహించిన‌వే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు ఎందుకంటే.. ఒక ప్ర‌తిప‌క్ష అధినేత పై దాడి జ‌రిగితే ఖండించాల్సిందిపోయి ముసి ముసి న‌వ్వుల‌తో రివ‌ర్స్‌లో జ‌గ‌న్ పైనే చంద్ర‌బాబు వ్యాఖ్యాలు చేశార‌ని.. అలాంటిది టీడీపీ త‌మ్ముళ్లు వ్యాఖ్యానించ‌డంతో ప్ర‌జ‌లు ఎలాంటి ఆశ్చ‌ర్యాల‌కు గురి కాలేద‌ని.. అయినా ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.