రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌నలు.. జ‌గ‌న్ పై హత్యాయత్నం.. ఆ టీడీపీ మంత్రి పాత్ర ఉందా..?

Wednesday, November 14th, 2018, 08:37:59 AM IST

ఏపీ ప్ర‌తిప‌క్ష అధినేన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నంలో భాగంగా దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విష‌యంలో మంగ‌ళ‌వారం చంద్ర‌బాబుతో స‌హా ఎనిమందికి నోటీసులు ఇచ్చి రెండు వారాల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న పై స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ జరిపించాల‌ని వైసీపీ నేత‌లు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు విన‌తిప‌త్రాన్ని అందిస్తూ విజ్ఞ‌ప్తి చేయ‌డంతో మ‌రోసారి రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు.. జగన్ పై జ‌రిగిన దాడిలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, నటుడు శివాజి, రెస్టారెంట్ యాజమాని హర్షవర్ధన్ పాత్ర ఉందని వైసీపీ నేత‌లు సంచలన ఆరోపణలు చేశారు. డీజీపీ ఠాకూర్‌కి కూడా జ‌గ‌న్ పై దాడి జ‌రుగుతుంద‌ని ముందుగానే తెలుస‌ని.. ప‌క్కా ప్లాన్ ప్ర‌కారమే జ‌గ‌న్ పై దాడి జ‌రిగిందని.. దాడి తర్వాత వెంట‌నే డీజీపీ చేసిన వ్యాఖ్య‌లు అనేక అనుమానాల‌కు తావిస్తున్నాయ‌ని వైసీపీ నేత‌లు అన్నారు. ఇక జ‌గ‌న్ పై హ‌త్యా ఘ‌ట‌న‌కు ముందే ఎవ‌రెవ‌రు స‌మావేశం అయ్యారో త‌మ ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయని.. అయితే ఆ ఆధారాలు రాష్ట్ర పోలీసుల‌కు ఇస్తే.. వాటిని తారుమారు చేసే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ నేత‌లు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ పై దాడి ఘ‌ట‌న‌లో చంద్ర‌బాబు పాత్ర లేక‌పోతే సీబీఐ విచార‌ణ కోరాల‌ని వైసీపీ నేత‌లు డిమాండ్ చేశారు. మ‌రి వైసీపీ శ్రేణుల ఆరోప‌ణ‌ల పై టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.