భారత్ ఘోర పరాజయం..మ్యాచుని టర్న్ చేసేసిన “టర్నర్”..

Sunday, March 10th, 2019, 11:27:53 PM IST

ఈ రోజు భారత్ మరియు ఆసీస్ మధ్య నాలుగో మ్యాచ్ జరిగిన సంగతి అందరికీ తెలిసినదే టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న మన టీమ్ బ్యాటుతో జూలు విదిల్చారు..ధావన్ సెంచరీతో రెచ్చిపోగా రోహిత్ శర్మ సెంచరీకి చేరువగా వచ్చి ఆగిపోయాడు.50 ఓవర్లలో ఆసీస్ ముందు 358 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగా ఈ మ్యాచ్ మాత్రం మనదే అని అందరు అనుకున్నారు.కానీ..ఆసీస్ మాత్రం ఇక్కడే పెద్ద దెబ్బ వేసారు,ఉస్మాన్ ఖవాజా 91(99) పరుగులు తీయగా హ్యాండ్స్ కొంబ్ 115(105) పరుగులతో వీరు కూడా ఎంతో చాకచక్యంగా ఆడారు.అయినా సరే 35-40 ఓవర్ల వరకు మనకే గెలిచే అవకాశాలు ఉండగా అప్పటికే బరిలో ఉన్న ఆస్తోన్ టర్నర్ తన బ్యాటుతో విజృంభిస్తున్నారు.

ఇంకా రిక్వైర్డ్ రన్ రేట్ 10 మీద ఉండగా టర్నర్ మొత్తం టర్న్ చేసేసాడు.ఒక పక్క సిక్సర్లుఫోర్లు బాదుతూ మన బౌలర్లకు చుక్కలు చూపించారు.దానికి తోడు మన వాళ్ళు మూడు క్యాచులు వదిలేయడం మరో పెద్ద నష్టమయ్యింది.దీనితో టర్నర్ 43 బంతుల్లో 6 సిక్సర్లు 5 ఫోరులు బాది 84 పరుగులు చేసి మనకి ఓటమిని వారికి విజయాన్ని అందజేశాడు.ముగిసిన నాలుగు వన్డే మ్యాచులలో ఇరు జట్లు 2-2 తో సమానంగా ఉన్నారు.ఈ సిరీస్ ఎవరు చేజిక్కించుకోనున్నారో తెలియాలంటే చివరి మ్యాచు వరకు ఆగాల్సిందే..ఈ మ్యాచు మాత్రం హోరాహోరీ గా ఉంటుందనే చెప్పాలి.