ఆసిస్ 342 పరుగుల భారీ స్కోర్!

Saturday, February 14th, 2015, 01:35:49 PM IST


వరల్డ్ కప్ – 2015 పోటీలో భాగంగా పూల్ – ఏ లో నేడు ఆస్ట్రేలియాలో జరిగిన ఆసిస్- ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఆసిస్ భారీ స్కోరును నమోదు చేసుకుంది. కాగా అరోస్ ఫించ్ 135 పరుగుల సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 343 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు పెట్టింది. ఇక టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 342 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాండ్ వరుస బంతుల్లో ఓపెనర్ వార్నర్ ను, వాట్సన్ ను అవుట్ చేశాడు.

అనంతరం వచ్చిన స్టీవెన్ స్మిత్ కూడా 5 పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో ఆసిస్ టీం కష్టాల్లో పడింది. ఇక ఫించ్, బెయిలీల బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో ఆసిస్ అద్భుతాన్ని చేసింది. కాగా ఫించ్ రన్ అవుట్ అవ్వగా వెంటనే బెయిలీ కూడా ఫిన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అనంతరం వచ్చిన మ్యాక్స్ వెల్, హాడిన్ వేగంగా తీసిన పరుగులతో ఆసిస్ భారీ స్కోర్ ను నమోదు చేసుకుంది.