భారీ స్కోరు సాదించిన ఆస్ట్రేలియా

Friday, August 23rd, 2013, 12:51:40 PM IST

cricket
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన యాషెస్ ఐదో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. 307/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ (241 బంతుల్లో 2 సిక్స్‌లు, 16 ఫోర్లతో 138 నాటౌట్) తన తొలి సెంచరీ నమోదు చేయడంతో 128.5 ఓవర్లలో 9 వికెట్లకు 492 పరుగులు సాధించి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి రోజు షేన్ వాట్సన్ (176) భారీ శతకంతో భారీ స్కోరుకు బాటలు వేసిన విషయం విదితమే. రెండో రోజు ఆరంభంలోనే పీటర్ సిడిల్ (23) పెవిలియన్ చేరుకోవడంతో స్మిత్ కుదురుగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.టెయిలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఒక వైపు ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ చెలరేగుతున్నా వెరవక సెంచరీ పూర్తి చేసుకున్నాడు.అనంతరం జాగ్రత్తగా ఆడిన ఇంగ్లండ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సరికి 17.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 32 పరుగులు చేసింది .ఆస్ట్రేలియా తొలి సారి ఈ సిరీస్ లో ఇన్నింగ్స్ డిక్లేర్ చెయ్యడం విశేషం .