వామ్మో.. ఇలా కూడా ఔటవుతారా?

Wednesday, September 5th, 2018, 12:50:31 PM IST

అత్యధిక ఆదరణ పొందిన ఆటల్లో క్రికెట్ ఒకటి. ప్రస్తుత రోజుల్లో టీ20 ఫార్మాట్ ను అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే అప్పుడప్పుడు క్రికెట్ లో అనుకోకుండా జరిగే సన్నివేశాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా బ్యాట్స్ మెన్ లు అవుటయ్యే విధానం అప్పుడప్పుడు నవ్వును తెప్పిస్తుంటుంది. రీసెంట్ గా ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ అవుటయిన విధానం కూడా నెటిజన్స్ కి కామెడీగా అనిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఒక మ్యాచ్‌లో భాగంగా ఎన్‌పీఎస్‌, విక్టోరియా మధ్య జరిగిన పోరులో బ్యాట్స్‌మన్‌ జేక్‌ వెదర్లాడ్‌ డిఫెరెంట్ గా ఔటయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంతిని కొట్టబోయి బ్యాట్ ను చేజార్చుకున్న అతను మూల్యం చెల్లించుకున్నాడు. చేతిలో నుండి జారిపోయి గాల్లోకి లేచిన బంతి అతను వెనుక ఉన్న వికెట్లను తాకింది. దీంతో అతను హిట్ వికెట్ గా అవుటయ్యాడు. దీన్ని చుసిన నెటిజన్స్ ఇలా కూడా అవుటవుతారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments