వీడియో : హాలీవుడ్ మూవీ ట్రైలర్ రికార్డ్..చూస్తే వావ్ అనాల్సిందే !

Saturday, December 2nd, 2017, 03:15:41 AM IST

హాలీవుడ్ లో గ్రాఫిక్స్ సినిమాలు ఏ స్థాయిలో తెరకెక్కుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సూపర్ హీరోస్ కథలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఆ సినిమాలు వరల్డ్ రికార్డ్ బాక్స్ ఆఫీస్ లను తిరగరాస్తుంటాయి. అయితే అలంటి బాక్స్ ఆఫీస్ సినిమా త్వరలో మరొకటి రాబోతోంది. అదే అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

అయితే రీసెంట్ గా సినిమా యొక్క థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్ అయ్యి సరికొత్త్త రికార్డ్ ను సృష్టించింది. ప్రస్తుతం ఆ ట్రైలర్ లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. అంతే కాకుండా సినిమా స్థాయిని కూడా పెంచేసింది. బుధవారం రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ను 24గంటల్లోనే 2.30 కోట్లమందికి పైగా వీక్షించారు. అవెంజర్స్‌ అలాగే ది గార్డియన్‌ ఆఫ్‌ ది గెలాక్సీ లో ఉన్న సూపర్ హీరోస్ ఇందులో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2018 మే 4న రిలీజ్ కానుండగా ఇండియాలో మాత్రం 2018 ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments