ట్రైలర్ టాక్ : అదిరిపోయింది..అ!

Wednesday, January 31st, 2018, 08:32:32 PM IST

నా డైరీలో లాస్ట్ ఎంట్రీ..నేనొక మాస్ మర్డర్ చేయబోతున్నా అంటూ వాయిస్ ఓవర్ తో ప్రారంభం అయిన అ ! ట్రైలర్ అదిరిపోయింది. చేపలకు కూడా కన్నీళ్లు ఉంటాయి బాస్. నీళ్ళల్లో ఉంటాం కదా కనపడవంతే అంటూ నాని చేపకు ఇస్తున్న వాయిస్ ఓవర్ తో చిత్రంపై అంచనాలు, ఆసక్తి పెరిగిపోవడం ఖయాం.

చిత్రంలోని ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యమంగా వీరందరి వెనుక ఉన్న కామన్ పాయింట్ ఏంటి అని తెలుసుకోవాలనే ఉత్సుకత అభిమానుల్లో ఈ ట్రైలర్ ద్వారా పెరిగిపోనుంది. గులాబీ రేకులని తుంచుతూ కనిపిస్తున్న కాజల్ అగర్వాల్ తన హావభావాలతో ఆకట్టుకుంటోంది. కాజల్, నిత్యామీనన్, రెజీనా, శ్రీనివాస్ అవసరాల మరియు మురళి శర్మ వంటి ప్రముఖులంతా ఈ చిత్రంలో నటించారు. ఇంతకీ నాని రోల్ ఈ చిత్రంలో ఏంటి అనే సస్పెన్స్ కూడా రైజ్ అయిపోతోంది. అన్ని విషయాలు తెలియాలంటే విడుదల తేదీ ఫిబ్రవరి 16 వరకు ఆగాల్సిందే.