పార్టీలో య‌వ‌రాజాకే ఏకుమేక‌య్యాడు!

Thursday, October 4th, 2018, 02:35:12 AM IST

తేదేపా సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి అయ్య‌న్న పాత్రుడి తీరుతెన్నులు గ‌త ఏడాది కాలంగా పార్టీవ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌న శ‌త్రువు .. పార్టీలో మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు అయిన గంటా శ్రీ‌నివాస‌రావు అవినీతిపై చెల‌రేగిపోయి వైజాగ్ సిట్ దర్యాప్తున‌కు స‌హ‌క‌రించిన అయ్య‌న్న పాత్రుడు, వేల కోట్ల భూ- దోపిడీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వైజాగ్ నుంచి అన‌కాప‌ల్లి వ‌ర‌కూ హైవేల వెంబ‌డి గంటా శ్రీ‌నివాస‌రావు భూక‌బ్జాల ఫ‌ర్వాన్ని ఆయ‌న తూర్పార‌బ‌ట్టారు. అయితే ఆ ఉదంతం అలా ఉండ‌గానే పార్టీలోనే మ‌రో నాయ‌కుడిని అయ్య‌న్న టార్గెట్ చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది. అయితే ఈసారి ఏకంగా తేదేపా యువ‌రాజా లోకేష్ నాయుడినే ఆయ‌న టార్గెట్ చేయ‌డం ఉత్కంఠ పెంచుతోంది. అయ్య‌న్న‌కే కోపం తెచ్చేలా యువ‌రాజా అంత త‌ప్పేం చేశారు? అంటే దానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉండ‌నే ఉంది.

ఇక‌పోతే అయ్య‌న్న టార్గెట్ చేసిన యాంగిల్ కాస్తంత విచిత్రంగా ఉంది. ఇటీవ‌లే ఆయ‌నో రూల్‌ని ప్ర‌తిపాదించారు. ఇక‌మీద‌ట నామినేష‌న్ వేసే స‌మ‌యంలో `వందేమాత‌ర ఆలాప‌న‌` త‌ప్ప‌నిస‌రి అని చెప్పారు. స‌రిగా పాడితేనే నామినేష‌న్ ఓకే చేయాలి! అది పాడ‌టం రానివాళ్లు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చెలామ‌ణి అయిపోవ‌డానికి అన‌ర్హులు.. అని రూల్ ప్ర‌తిపాదించారు. దీన‌ర్థం .. అస‌లు మామూలు తెలుగు ప‌దాలే స‌రిగా ప‌ల‌క‌డం రాని లోకేష్ బాబు, బీకాంలో ఫిజిక్స్ లాంటి వాళ్ల‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించండి అనే క‌దా!? అంటే ముందుగా లోకేష్‌కి పార్టీ నుంచి చెల్లు చీటీ ఇవ్వండ‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పిన‌ట్టే అయ్యింది. ప‌లు మార్లు లోకేష్ మాట్లాడిన తింగ‌రి మాట‌ల వీడియోలు ఇప్ప‌టికే సామాజిక మాధ్య‌మాల్లో బోలెడంత కామెడీ అయిపోయాయి. అయితే అయ్య‌న్న అలా యువ‌రాజా పైనే చెల‌రేగిపోవ‌డం వెన‌క వేరొక వాద‌నా బ‌లంగా వినిపిస్తోంది. ఇంకా పార్టీలో ఎన్నాళ్లు అని నంబ‌ర్ 2,3,4 పొజిష‌న్‌లో ఉండాలి. షార్ట్ క‌ట్ లో వ‌చ్చి మంత్రి అయిపోయిన లోకేష్ నెక్ట్స్ సీఎం అయిపోతే ఎలా? ఇన్నాళ్లుగా సేవ‌లు చేస్తున్న త‌మ ప‌రిస్థితి ఏంటి? అని అయ్య‌న్న‌లో లోలోన ఆవేద‌న దాగి ఉంద‌ని మాట్లాడుకుంటున్నారు. మంచిదే.. సీనియ‌ర్లు సీఎంలు కాకుండా, జూనియ‌ర్‌లు అయిపోతామంటే త‌ప్పే మ‌రి! ఆయ‌న ఆవేద‌న‌లో అర్థం ఉంది.