అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలి అంటున్న వైసిపి నేత

Tuesday, April 10th, 2018, 12:14:39 PM IST

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక విషయమై చెప్పినట్లు తమ ఎంపీలు రాజీనామా చేశారని, అలానే అధికారం లో వున్న టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసినట్లయితే మోడీ ప్రభుత్వం కొంత ఇబ్బందుల్లో పడదని, ఆ విధంగా మన సత్తా చాటడం ద్వారా హోదా ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లవచ్చని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్న విషయం తెలిసిందే. అయితే తమ నేత, మరియు పార్టీ లీడర్లు, ఎమ్యెల్యేలు ఎంపీలు ఇలా అందరూ హోదా కోసం పోరాడుతుంటే బాబు మాత్రం తన స్వలాభం కోసం పాకులాడుతున్నారని పలువురు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.

టిడిపి మంత్రి అయ్యన్నపాత్రుడు తన నోరును అదుపులో పెట్టుకోవాలని లేకపోతే పిచ్చికుక్కను తరిమి కొట్టినట్లు కొడతామని విశాఖ జిల్లా వైఎస్సార్‌ సీపీ నాయకుడు గుడివాడ అమరనాథ్‌ హెచ్చరించారు. ఈ విధంగా తాము హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే, మరోవైపు టిడిపి నేతలు, ఎంపీలు దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడమే కాకుండా హోదాను తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం ప్రత్యేక హోదా కోసం నర్సిపట్నంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నాయి.

పెందుర్తి నియోజక వర్గ ఇన్‌చార్జ్ అదీప్ రాజ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గాజువాకలో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త తిప్పల నాగరెడ్డి ఆధ్వర్యంలో 3వ రోజూ దీక్షలు కొనసాగుతున్నాయి. నర్సీపట్నం కన్వీనర్ పెట్ల ఉమాశంకర గణేష్ ఆధ్వవర్యంలో హోదా సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజు​కు చేరుకున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంకు ముందు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు రాస్తారాకో, బైఠాయింపులు చేపట్టారు….