ధోనిని అవమానించడంతో అగ్గిమీద గుగ్గిలమైన మాజీ క్రికెటర్ !

Wednesday, February 22nd, 2017, 02:20:52 AM IST


టీం ఇండియా మాజీ కెప్టేన్ ధోనిని ఐపీఎల్ జట్టు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ సారధ్య బాధ్యతల నుంచి అనూహ్యంగా ఆ జట్టు యాజమాన్యం తప్పించిన విషయం తెలిసిందే. దీనిపై ధోని అభిమానుల నుంచి మాజీల నుంచి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. పూణే ప్రాంచైజీ ధోనిని ఘోరంగా అవమానించిందని మండి పడ్డాడు. ధోని ఇండియా కు రెండు ప్రపంచ కప్ లను అందించిన కెప్టెన్ అని, అతని కెప్టెన్సీ లో టీం ఇండియా ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని పేర్కొన్నాడు.భారత క్రికెట్ కు దొరికిన మేలిమి బంగారం ధోని అని అజహర్ కొనియాడారు.

పూణే ప్రాంచైజీ తమ డబ్బుతో జట్టుని నడిపిస్తున్నా ధోనిని తొలగించేముందు అతడికి ఉన్న ఖ్యాతిని గురించి ఒక్కసారి ఆలోచించాల్సింది. ధోని గొప్ప కెప్టెన్, పూణే యాజమాన్యం అతడి పట్ల ప్రవర్తించిన విధానం తనకు ఓ క్రికెటర్ గా ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి అని అజారుద్దీన్ అన్నారు.