కెసిఆర్ దగ్గర నువ్వెంత నీ బతుకెంత..సంచలన వ్యాఖ్యలు.!

Sunday, September 30th, 2018, 12:02:58 AM IST

తెలంగాణలోని ముందస్తు ఎన్నికలు ఒకపక్క సెగ రాజేస్తుంటే దానికి తోడు రేవంత్ రెడ్డి పై జరిగిన ఐటీ సోదాలు మరింత వేడిని పుట్టించాయి.దీనితో రేవంత్ రెడ్డి కెసిఆర్ మరియు నరేంద్ర మోడీలు కలిసి తనపై కావాలని కుట్ర చేయించారని,తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు,అంతే కాకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ పైన కూడా అవినీతి ఆరోపణలు చేశారు.కేసీఆర్ యొక్క వ్యవసాయ క్షేత్రం వెయ్యి ఎకరాలు ఉందని అన్ని ఎకరాలు ఎలా వచ్చాయని కేసీఆర్ ఏ అవినీతి చెయ్యకుండానే వచ్చాయా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

దీనికి గాను తెరాస పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ రేవంత్ రెడ్డి మీద కొన్ని తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు.అప్పుడు చంద్రబాబు నాయుడు,వై ఎస్ రాజశేఖర్ రెడ్డిలే కేసీఆర్ ని ఏమి చేయలేకపోయారని,నువ్వు కేసీఆర్ ని అనేంత మగాడివి అయ్యావా, నువ్వెంత నీ బతుకెంత అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు,కేసీఆర్ ఎంతో నిజాయితీగా పోరాడి తెలంగాణను సంపాదిస్తే ఆయన మీద నువ్వు అవినీతి ఆరోపణలు చేస్తావా అని మండిపడ్డారు.కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వెయ్యి ఎకరాలు అని చెప్తున్నావు చూపిస్తావా ఆ వెయ్యెకరాలు అంటూ తీవ్రమైన పదజాలంతో విరుచుకు పడ్డారు.