వీడియో : కార్యకర్తలపై ఆగ్రహంతో కాలెత్తిన బాబూమోహన్

Tuesday, September 4th, 2018, 04:41:52 PM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూమోహన్ కి సంబందించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలి కాలంలో బాబూమోహన్ తరచు వివాదాల్లో నిలుస్తున్నారు. అసభ్య పదజాలాలు వాడుతున్నారని ఆరోపణలు రావడంతో పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అసలు విషయంలోకి వస్తే రీసెంట్ గా టీఆరెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రగతి నివేదన సభను నిర్వహించిన సంగతి తెలిసిందే.

అయితే ముందు రోజు నుంచే నాయకులు వారి నియోజక వర్గాల నుంచి ర్యాలీని నిర్వహిస్తూ వచ్చారు. అందులో భాగంగానే బాబూమోహన్ కూడా తన నియోజకవర్గమైన ఆందోల్ నుంచి ర్యాలీ ప్రారంభించారు. అయితే బాబు మోహన్ జెండా ఊపే క్రమంలో కొందరు కార్యకర్తలు అడ్డుగా ఉన్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా వారిపైకి కాలు లేపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments