నన్ను రాజకీయాల్లోకి తీస్కోచింది ఆయనే..నడిరోడ్డు మీద వదిలేసింది ఆయనే.!

Friday, October 12th, 2018, 11:43:41 AM IST

సినీ హాస్య నటుడు మరియు ప్రముఖ రాజకీయ నాయకుడు బాబు మోహన్ ఇటీవలే తన గాడ్ ఫాదర్ అని చెప్పుకుంటూ వచ్చే కెసిఆర్ యొక్క పార్టీ అయిన తెరాస పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరి కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసినదే.బాబు మోహన్ తెరాస పార్టీని వీడి బీజేపీ పార్టీ చేరడానికి గల కారణం ఏమిటో కూడా అందరికి తెలుసు.సంగారెడ్డిలోని బీజేపీ శ్రేణులు నిర్వహించినటువంటి ఒక సభలో కెసిఆర్ తనకి చేసినటువంటి మోసాన్ని చెప్తూ బాబు మోహన్ కంటతడి కూడా పెట్టుకున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆయనకీ ఏ మాత్రం సమాచారం కూడా ఇవ్వకుండా వేరే వ్యక్తికి టిక్కెట్టుని కేటాయించి కెసిఆర్ తనని మోసం చేశారని బాబు మోహన్ ఆరోపించారు.ఒకప్పుడు తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఈ ఉద్యమాలు అన్ని అయ్యిన తర్వాత కెసిఆర్ గారు మరియు హరీష్ రావు గారు ఫోన్లు మీద ఫోన్లు చేసి తనని మళ్ళీ రాజకీయాల్లోకి రమ్మని మరీ పిలిపించారని,కెసిఆర్ గారి మీద ఎంతో గౌరవంతో ఆయన ఎక్కడికి తన్నితే అక్కడికి ఒక బంతిలా వెళ్లానని,అలా రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఆయనే ఎమ్మెల్యేని కూడా చేసింది కెసిఆర్ గారే మరియు ఇలా నడిరోడ్డు మీద వదిలేసింది కూడా కెసిఆర్ గారే అని చెప్పుకుంటూ బాబు మోహన్ గారు తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యి కంటతడి కూడా పెట్టుకున్నారు.