కెసిఆర్ బండారం బయట పెడుతున్న బాబూమోహన్..!

Thursday, October 11th, 2018, 08:30:46 AM IST

తెలంగాణా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిమిత్తం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ తర్వాత జరగబోయే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల యొక్క జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసినదే.అయితే ఆ జాబితాలో సీటు ఆశించినటువంటి చాలా మంది అభ్యర్థుల తమ పేర్లు లేవని మనస్తాపం చెందిన సంగతి తెలిసినదే,ప్రస్తుతం బీజేపీ కండువా కప్పుకొని తెరాస పార్టీకి షాక్ ఇచ్చినటువంటి ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు బాబు మోహన్ కూడా ఆ కోవకే చెందుతారు.అప్పటి వరకు తెరాస పార్టీలో ఉన్నా తనకి ఏ సీటు కేటాయిచకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి కంటతడి కూడా పెట్టుకున్నారు.

ఇక ఎప్పుడైతే బీజేపీ కండువా కప్పుకొని కాషాయ పార్టీలో చేరారో ఇక కెసిఆర్ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు.తన చిన్నప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాను కానీ,సెక్రటేరియేట్ కు వెళ్లకుండా ఏ ముఖ్యమంత్రి ఉండరు అని తెలిపారు.కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కనబడకుండా ముసుగేసుకుని కనబడకుండా ఆయన ఫామౌస్ లో కూర్చునే ముఖ్యమంత్రి మాత్రం కెసిఆర్ ఒక్కడే అని వ్యాఖ్యానించారు.

అంతే కాకుండా ఇటీవలే తెలంగాణా రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ నడిరోడ్డు మీదనే హత్యలు ఎక్కువయ్యిపోయాయి,పట్టపగలే కత్తులు,గొడ్డళ్లు పట్టుకొని మనుషుల్ని నరుకుతున్నారని ఈ విషయంలో కెసిఆర్ యొక్క పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా విఫలమయ్యిందో చూసుకోవాలి అని అసలు ఇందుకేనా తెలంగాణా వచ్చింది అని ప్రశ్నించారు.కెసిఆర్ తనకి కొండగట్టు ప్రాంతం అంటే అమితమైన ఇష్టం అని ఎప్పుడు చెబుతుంటారు అని,కానీ ఈ మధ్యనే అక్కడ ఘోర బస్సు ప్రమాదం జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతే అక్కడ దగ్గరలోనే ఉండి కూడా ఎందుకని వారిని పరామర్శించడానికి వెళ్లట్లేదు అన్నదానికి కెసిఆర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని అన్నారు.