గులాబీ గుచ్చుకుంది ..తెరాసకు బాబు మోహన్ రాంరాం ?

Monday, October 1st, 2018, 10:57:47 AM IST

నమ్ముకున్న పార్టీ నట్టేట ముంచేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న నటుడు, రాజకీయ నాయకుడు బాబు మోహన్ కు నిరాశ ఎదురైంది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో తెరాస పార్టీలో చేరిన అయన అందోల్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. సినీ నటుడిగా మంచి చరిష్మా ఉందనుకుని వచ్చే ఎన్నికల్లో కూడా తనకు సీటు వస్తుందని భావించిన బాబు మోహన్ కు అధిష్టానం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ నియోజకవర్గ సీటు మరొకరికి కేటాయించడంతో పాటు బాబు మోహన్ కు సీటు దక్కలేదు .. దాంతో ఫీల్ అయిన ఆయన తెరాస పార్టీకి రాంరాం చెబుతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అయన బిజెపి లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ వెళ్లొచ్చారు. తెరాస పార్టీలో తనకు అన్యాయం జరిగిందని , పార్టీ కోసం ఎంతో కష్టపడితే తనకు అన్యాయం చేసారని అయన చెప్పుకొచ్చారు. త్వరలోనే అయన బిజెపి లో చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే బిజెపి నుండి అందోల్ లో సీటు దక్కుతుందా లేదా అన్నది చూడాలి. అయితే ప్రసుత్తం బాబు మోహన్ కు అందోల్ నియోజక వర్గంలో వ్యతిరేకత ఎక్కువ ఉన్నందునే అయన తెరాస పార్టీ పక్కన పెట్టిందని ప్రచారం జరుగుతుంది.