ఢిల్లీలో బాబు సంచలనం – మాకు వైసీపీ మద్దతు అవసరం

Monday, February 11th, 2019, 06:14:36 PM IST

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టిన సంగతి విదితమే… ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీ ప్రతిపక్షమైన వైసీపీ కూడా మాతో కలవాలని, వైసీపీ కూడా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడే ఉంది కాబట్టి వారు కూడా తమకు మద్దతు తెలపాలని చంద్రబాబు మీడియా సమావేశంలో తెలిపారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ వారు ఒకటో రెండో సీట్లు గెలుచుకుంటే వారు కూడా తమతో కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి చంద్రబాబు గారు తలపెట్టిన దీక్షకు దేశవ్యాప్తంగా చాలా మద్దతు వస్తుందే చెప్పాలి. ఈ దీక్షకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ నాయకురాలు మాయావతి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు కూడా చంద్రబాబు కు మద్దతు ఇస్తున్నారు…