ఆయన్నుండి బాబు రూ.150కోట్లు తీసుకున్నారు : విజయసాయి

Tuesday, April 3rd, 2018, 01:45:09 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అవినీతిపాల సాగుతోందని విమర్శించాడు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇంకెంతో కాలం నిలువదని, ఆయనకు ప్రజలే రానున్న ఎన్నికల్లో బుడ్డి చెపుతారని అన్నారు. బ్యాంకులను రూ. 9వేల కోట్ల మేర ముంచేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాతో తనను చంద్రబాబు నాయుడు పోలుస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2016 మార్చిలో మాల్యాను లండన్ లో చంద్రబాబు కలిశారని ఆరోపించారు. పార్టీ కోసం రూ. 150 కోట్ల విరాళం తీసుకున్నారని, అది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు.

స్పందించకపోతే తాను చేసిన ఆరోపణలు నిజమే అని నమ్మాల్సి వస్తుందని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వస్తున్నది కూడా రాజకీయ లబ్ధకోసమేనని, తన పార్టీ వ్యక్తుల లబ్ధికోసమే ఆయన ఇక్కడికి వస్తున్నారు అన్నారు. అయితే గత నాలుగేళ్లుగా మోసం చేస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబుపై సభాహక్కుల నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇన్నాళ్లు ప్రత్యేక ప్యాకేజి అన్న చంద్రబాబు, ఇప్పుడు హోదా అనడం విడ్డూరమని, జగన్ ను చూస్తే బాబుకు భయమేస్తుందని, అందుకే మళ్లి ఎలాగైనా అధికారం లోకి రావాలని ఇలాంటి కుయుక్తులు ఎన్నో పన్నుతున్నారని అన్నారు…..