న్యూజిలాండ్ చేస్తానన్న బాబు

Tuesday, September 23rd, 2014, 06:57:53 PM IST

chandhra-babu-naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యాటక రంగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ట్రావెల్ టూరిజం వర్శిటీ అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పర్యాటకంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ బృందం వివిధ దేశాలలో పర్యటించి టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ట్రావెల్ టూరిజం వర్శిటీలో పర్యాటకంతో పాటు, వైద్యం, పౌష్టికాహారం, నైపుణ్యాల పెంపు, ఆతిధ్య రంగాలకు చోటు కల్పించాలని వివరించారు. అలాగే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో భారీ స్థాయి సదస్సు నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ను టూరిజం పరంగా న్యూజిలాండ్ లా తయారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.