జల విహార్ లో దారుణం.. నీటిలో పడిన ఏడాదిన్నర పాప!

Friday, May 25th, 2018, 01:04:44 PM IST

హైదరాబాద్ జలవిహార్ లో ఎవరు ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అక్షర అనే ఏడాదిన్నర పాప నీటి గుంటలో పడి మృతి చెందింది. నడుచుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిన చిన్నారిని ఎవరు గమనించకపోవడంతో దారుణం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. పాప తండ్రి జలవిహార్ లోనే పని చేస్తుంటాడు అని తెలుస్తోంది. ఎవరు గ్రహించని సమాయంలో అక్షర నడుచుకుంటూ నీటి గుంట వైపు వెళ్లడం సిసిటివి లో రికార్డ్ అయ్యింది. పాప తండ్రి పేరు అప్పల నాయుడు. జలవిహార్ లోనే పనిచేస్తుంటాడు. అయితే రోజులనే సాధారణంగా ఆడుకున్న పాప నిన్న గుంట వైపుగా వెళ్లి అందులో పడి మృతి చెందింది. సమీపంలో ఎవరైనా చూసి ఉంటే తన పాప బ్రతికి ఉండేదని తల్లి కన్నీరు పెట్టుకుంది.

  •  
  •  
  •  
  •  

Comments