బ్యాక్ టు బ్యాక్ బిగ్ సినిమాస్: అమెజాన్ సబ్స్క్రైబర్స్ కు పండగే..!

Sunday, February 10th, 2019, 02:40:04 PM IST

సినిమాలంటే థియేటర్ల దాకా వెళ్లి చూడటం అన్నది ఒకప్పటి మాట, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లాంటి యాప్స్ వల్ల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కావలసిన సినిమాను చూడగల సౌలభ్యం వచ్చేసింది. గతంలో బ్లాక్ బస్టర్స్ ను థియేటర్లో చూడటం మిస్ అయితే అది టీవిలో చూడాలంటే ఏ మూడు నెలలో, ఆరు నెల్లో పట్టేది. కానీ, అమెజాన్ లాంటి దిగ్గజం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ప్రవేశించి ఆ గ్యాప్ ను మరింత తగ్గించేసింది. బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపేసిన బ్లాక్ బస్టర్స్ సైతం నెల తిరిగేలోపు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దర్శనమిస్తున్నాయి.

ఇటీవల విడుదలైన పడి పడి లేచే మనసు, అంతరిక్షం కూడా అమెజాన్ ప్రైమ్ లో నెల రోజుల్లోనే స్ట్రీమ్ అయ్యాయి. తాజాగా సంక్రాతి సందర్బంగా విడుదులైన ఎన్టీఆర్ కథానాయకుడు 8వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వగా, అంచనాలను మించి బ్లాక్ బస్టర్ అయిన ఎఫ్2 కూడా 11న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవనుంది, ఎఫ్2 ఇంకా థియేటర్లలో ఉండటం గమనార్హం. 2018 సంవత్సరానికి ఇయర్ ఎండింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కేజీఎఫ్ కూడా ఈ నెల 5న అమెజాన్ లో స్ట్రీమ్ అవ్వబడింది. ఇలా వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ ను అందిస్తూ అమెజాన్ తన సబ్స్క్రైబర్స్ కు బంపర్ అఫర్ ఇస్తోంది, అమెజాన్ దూకుడు చూస్తుంటే రానున్న రోజుల్లో సినిమాలను నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.