ప‌నామా లీకేజీలాగా బ‌హ‌మ‌స్ లీకేజీ

Friday, September 23rd, 2016, 08:23:59 AM IST

Nimmagaada-Prasad
ప‌నామా ప‌త్రాల సంచ‌ల‌నం మ‌రువ‌క ముందే మ‌రో లీకేజీ ఇదే త‌ర‌హాలో పెనుకంప‌నాలు పుట్టిస్తోంది. ఈసారి ప‌నామాలో పుట్టిన పెను కంప‌నం కాదు.. దీనిని బ‌హ‌మ‌స్ లీకేజీ అని అంటున్నారు. ఇందులో మ‌న దేశానికి చెందిన ఏకంగా 250 మంది జాత‌కాలు బైట‌ప‌డ‌నున్నాయ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఇందులో ఉన్న కీల‌క వ్య‌క్తుల పేర్లు వినిపిస్తున్నాయి.

అంతెందుకు ఇందులో ఏకంగా 25 మంది పైగా తెలుగువారి పేర్లు ఉన్న‌ట్టు వెల్ల‌డైంది. అందులో పారిశ్రామిక వేత్త నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపించింది. ఈ మాజీ మాటీవీ అధినేత‌కు బ‌హ‌మ‌స్ లీకేజీతో పూర్తి లింకుంద‌న్న సంగ‌తి వెల్ల‌డైంది. అంతేకాదు సికింద‌రాబాద్‌కి చెందిన ఓ కంపెనీ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.