చిట్టీకి త‌లొంచిన `బాహుబ‌లి`!?

Thursday, December 6th, 2018, 12:39:02 AM IST

బాహుబ‌లి సిరీస్ అసాధార‌ణ విజ‌యం గురించి తెలిసిందే. బాహుబ‌లి 1 చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 600కోట్లు కొల్ల‌గొడితే, బాహుబ‌లి 2 చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1700 కోట్లు (జ‌పాన్ క‌లుపుకుని) వ‌సూలు చేసింది. ఇప్ప‌టికీ ఆ రికార్డులు సుస్థిరంగా ఉన్నాయి. ఇటీవ‌లే రిలీజైన థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోవ‌డంతో ఆ బాధ్య‌త‌ను 2.ఓ తీసుకుంది.

అయితే 2.ఓ సైతం బాహుబ‌లి సిరీస్ రికార్డుల‌కు ద‌రిదాపుల్లో లేక‌పోవ‌డంపై ట్రేడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బాహుబ‌లి 2 రికార్డుల్ని ట‌చ్ చేసే సినిమా ఇప్ప‌ట్లో రాద‌న్న‌ది నిజం. అయితే బాహుబ‌లి 1 రికార్డుల్ని మాత్రం 2.ఓ బ్రేక్ చేయ‌గ‌లిగింది. ఈ సినిమా రిలీజైన 6రోజుల్లో బాహుబ‌లి – ది బిగినింగ్ ఫుల్ టైమ్ రికార్డుల్ని బ్రేక్ చేసింది. అయితే అది వ‌ర‌ల్డ్ వైడ్ రికార్డు కాదు. కేవ‌లం హిందీ వెర్ష‌న్ రికార్డులు మాత్ర‌మే బ్రేక‌య్యాయి. బాహుబ‌లి 1 ఫుల్ ర‌న్‌లో 117 కోట్లు వ‌సూలు చేస్తే అంత‌కుమించి 2.ఓ 6రోజుల్లో వ‌సూలు చేసింద‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వెల్ల‌డించారు. అయితే బాహుబ‌లి 2 చిత్రం హిందీ వెర్ష‌న్ 511కోట్లు వ‌సూలు చేసింది. ఆ రికార్డుల ద‌రిదాపుల్లోకి 2.ఓ వెల్ల‌డం అన్న‌ది అసంభ‌వం అని తేలిపోయిన‌ట్టే. ఇక‌పోతే వ‌ర‌ల్డ్ వైడ్ రికార్డుల్లో 2.0 చిత్రం టాప్ 10లో నిలుస్తుందా? లేదా? అన్న‌ది వేచి చూడాల్సిందే.