బాలచందర్ ఇక లేరు!

Tuesday, December 23rd, 2014, 07:48:06 PM IST

Balachander
ప్రముఖ తమిళ దర్శకుడు కె బాలచందర్ ఈ సాయంత్రం కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాదపడుతున్న విషయం తెలిసిందే. కాగ.. ఆయనను చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో చేర్చిన విషయం కూడా తెలిసిందే. 80సంవత్సరాల వయసుగల బాలచందర్ శరీరం చికిత్సకు సహకరిస్తుందని డాక్టర్లు తెలిపిన విషయం కూడా విదితమే. అయితే… ఆయన చికిత్స పొందుతూ ఈ సాయంత్రం తుదిశ్వాసవిడిచినట్టు ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ప్రముఖ తమిళ నటుడు రజినీకాంత్ మరియు కుష్బూలు బాలచందర్ ను పరామర్శించిన విషయం కూడా విదితమే. తెలుగు తమిళ భాషలలో కె బాలచందర్ దర్శకత్వం అనేక చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇక బాలచందర్ మృతి పట్ల తమిళ తెలుగు చిత్ర పరిశ్రమ తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది.