బాలయ్య సెంటిమెంట్.. అదే రూమ్ బుక్ చేశారు !

Wednesday, May 22nd, 2019, 05:51:47 PM IST

సినిమా అయినా రాజకీయమైనా బాలయ్యకు సెటిమెంట్స్ ఎక్కువే. ఏ ముఖ్యమైన పనిచేసినా వాటిని ఫాలో అవుతుంటారు. నామినేషన్, ప్రచారం ఇలా అన్ని సమయాల్లో సెంటిమెంట్ ఫాలో అయిన ఆయన ఫలితాలు తేలే రోజున కూడా ముఖ్యమైన సెంటిమెంట్ పాటించనున్నారు. గత ఎన్నికల సమయంలో అనంతపూర్ ఎన్నికల కౌంటింగ్ జిల్లా కేంద్రంలోని ఎస్కేయూలో జరిగింది. ఆ సమయంలో బాలయ్య ఆర్డీటీ స్టేడియంలోని 9వ నెంబర్ గదిలో బసచేశారు.

ఈసారి కూడా కౌంటింగ్ ఎస్కేయూలోనే జరగనుంది. అందుకే బాలయ్య సెంటిమెంట్ ప్రకారం ఆర్డీటీ స్టేడియంలోని 9వ నెంబర్ గదిలోనే బస చేయాలని నిర్ణయించారు. కానీ ఆ గది ఖాళీ లేకపోవడంతో ఏదో చేసి ఆ గదిని ఖాళీ చేయించి బాలయ్య కోసం రెడీ చేశారు. ఈరోజు సాయంత్రం బాలయ్య అక్కడకు చేరుకుని గదిలోకి దిగనున్నారు. ఇక జిల్లా ముఖ్య నేతలు సైతం బాలయ్య బసకు దగ్గర్లోనే మకాం ఏర్పాటు చేసుకున్నారు. మరి సెటిమెంట్ ఫలించి విజయం బాలయ్యను వరిస్తుందో లేదో రేపు తేలిపోతుంది.