భాద్యత మొత్తం బాలయ్యపైనే తోసేసినట్టున్నారు?

Monday, October 1st, 2018, 11:40:42 AM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలన్నీ ప్రచార ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. అన్ని పార్టీల సంగతి పక్కనబెడితే టీడీపీ వ్యవహారం మాత్రం గమ్మత్తుగా ఉంది. ఆంధ్రాలో కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణాలో అదే కాంగ్రెస్ తో కలిసి ఎలా నడుస్తుందో, అందుకు చంద్రబాబు అవలంభించనున్న ప్లాన్స్ ఏమిటో చూడాలని అంతా ఆసక్తిగా ఉన్నారు.

ఈ తరుణంలో గత రెండు రోజుల నుండి బాబుగారు తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి రావట్లేదని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఓటుకు నోటు కేసు లాంటి కారణాలున్నా మొత్తానికి బాబు తెలంగాణ టీడీపీ తరపున ప్రచారం సాగించడంలేదు. దీంతో ప్రచార భాద్యత తలకెత్తుకునేదెవరో అనే సంశయం మొదలైంది. ఈ సంశయంలోనే బాబు ఆ భాద్యతను బాలయ్య నెత్తిన తోసేసినట్టు కనిపిస్తున్నారు.

ఈరోజు బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే హోదాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో పర్యటించి, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ తతంగం చూస్తే టీడీపీ తెలంగాణ ప్రచారానికి ఇది ట్రయల్ రన్ అనిపిస్తోంది. ఇది విజయవంతం అయితే పూర్తి ప్రచార భాద్యతను బాలయ్యకు అప్పగించాలని చంద్రబాబు ఆలోచన కావొచ్చు.