ఎన్టీఆర్ కథను ఎక్కడ ముగించాలో మాకు తెలుసు : బాలయ్య

Monday, May 28th, 2018, 11:59:56 AM IST

ఎన్టీఆర్ బయోపిక్ పై గత కొంత కాలంగా ఎన్నో అనుమానాలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలో ఎన్ని ఊహించని మలుపులు ఉన్నాయి. కొన్ని వివాదస్పద అంశాలు కూడా ఉన్నాయి. దాన్నిబాలయ్య ఎలా చూపిస్తారు అనేది హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు బాలయ్య రూమర్స్ కి విమర్శలకు కలిపి ఒకేసారి కౌంటర్ ఇచ్చారు. ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఎండ్ చేయాలో తనకు బాగా తెలుసని చెప్పారు.

ఈ ఉదయం మహానాడులో పాల్గొన్న బాలకృష్ణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరచిన పుస్తకమే. తెలుగు వాడు గర్వపడేలా సినిమాను తీస్తాం. సినిమా కథను ఎక్కడ నుంచి ప్రారంభించాలో.. ఎక్కడ ఎండ్ చేయాలో తనకు బాగా తెలుసునని చెప్పిన బాలయ్య ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి ఆదరణ లభించిందని సినిమాలో తెలియని కొన్ని కొత్త విషయాలను కూడా చూపిస్తామని తెలిపారు. అదే విధంగా సినిమాకు దర్శకత్వం వహించడానికి క్రిష్ ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని బాలకృష్ణ తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments