దావోస్ లో చంద్రబాబు..సీఎం చైర్ ఆక్రమించేసిన బాలయ్య..!

Wednesday, January 24th, 2018, 10:24:59 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యమంత్రి కుర్చీని కబ్జా చేసేశారు. అంతలోనే కంగారుపడకండి. బాలకృష్ణ ఈ పని ఉద్దేశ పూర్వకంగా చేయలేదు. పొరపాటున అలా జరిగింది. ఎలాగు సీఎం కూర్చులో కూర్చున్నది చంద్రబాబు బావమరిదే కావడంతో అధికారులు కూడా సైలెంట్ అయిపోయారు.

ఓ సాధారణ ఎమ్మెల్యే గా తప్ప బాలయ్యకు టీడీపీలో కానీ, ప్రభుత్వం లో కానీ ప్రత్యేక మైన పదవులు, అధికారాలు లేవు. కానీ చంద్రబాబు వియ్యంకుడిగా ఆయనకు టీడీపీ నేతలో స్పెషల్ స్టేటస్ ఎలాగూ ఉంటుంది. దీనిని అడ్డు పెట్టుకుని బాలయ్య ఎప్పుడూ మితిమీరి ప్రవర్తించలేదు. తాన్ నియోజకవర్గంలోని లేపాక్షి పుస్తకాల గురించి బాలయ్య అధికారులతో రివ్యూ చేశారట. ఈ సమీక్ష సమావేశం సీఎం క్యాంపు ఆఫీస్ లో జరిగింది. బాలకృష్ణ నేరుగా వెళ్లి చంద్రబాబు కుర్చీలో కుర్చునేశారు. ప్రోటోకాల్ వివరించి బాలయ్యని ఆ కుర్చీలోనుంచి పైకి లేపే సాహసం ఏ అధికారి చేయలేదు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు కూడా పాల్గొన్నారు.